Home » Devotional » లింగాభిషేకములో పరమార్ధం

లింగాభిషేకములో పరమార్ధం

లింగాభిషేకములో పరమార్ధం

శివలింగం:

నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే “లింగం”.

పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం – భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.

shiva

శివ షడక్షరీ స్తుతి (Shiva Shadakshari Stuti)

శ్రీ మేధా దక్షిణామూర్తి రూపాయ పరమాత్మనే నమ:

శివాయ వేద్యాయ నాథాయ గురవే నమ:

ఓం కారం తు పరం బ్రహ్మ సర్వమోంకార సంభవమ్ అకారోకారమంతాయ ఓంకారాయ నమో నమ:

న నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర

నమస్తే వృషభారుఢ నకారయ నమో నమ:

మ: మహాదేవం మహాత్మానం మహా పాతక నాశనం మహా నటవరం వందే మకారాయ నమో నమ:

షి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకమ్ శివమేకపదం దేవం శికారాయ నమో నమ:

వా వాహనం వృషభో యస్య వాసుకి: కంఠభూషణమ్

వామే శక్తిధరం దేవం వాకారాయ నమో నమ:

య యత్ర యత్ర స్థితో దేవ: సర్వవ్యాపీ మహేశ్వర: యల్లింగం పూజయేన్నిత్యం యకరాయ నమో నమ:

ఓం ఓంకారామంత్ర సంయుక్త నిత్యం ధ్యాయంతి యోగిన:

కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ:

మహాదేవ: పరో మంత్ర: మహాదేవం: పరం తప: మహాదేవ: పరా విద్యా మహాదేవ: పరా గతి:

ఓం నమ: శివాయేతి చ షడ్లింగాయ నమో నమ:

మోక్షకామ్య ప్రదాత్రే చ విశ్వరూపాయ తే నమ: నమ:

శివాయ సోమాయ సతారాయ షడత్మనే

స్వయం జ్యోతి: ప్రకాశాయ స్వతంత్రాయ నమో నమ:

మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే నమ:

శివాయ శాంతాయ బ్రాహ్మణే లింగమూర్తయే

ఓంకారాయ విశేషాయ నమో దుందుభినే నమ: నమ:

శివాయ రుద్రాయ ప్రధానాయ నమో నమ:

గురవే సర్వలోకానం భిషణే భవరోగిణామ్

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ:

జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనమ్

తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదామ్

ఋత్గగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళమ్

ఊర్థ్వరేతం విరూపాక్షం విశ్వరూపం నమోమ్యహమ్

ధ్యాయే దభీష్టసిద్ధ్యర్థ మహర్నిశ ముమాపతిం

ఈశానం సర్వవిద్యానా మీశ్వరేశ్వర మవ్వయమ్

గోభీ ర్జుష్టం ధనేన హ్యాయుషా చ బలేన చ

ప్రజయా పశుభి: పుష్కరాక్షం

త న్మే మన:శివసంకల్పమస్తు

సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా

శాంతి: పత్నీ క్షమా పుత్ర: షడతే మమ బాంధవా:

ఇతి షడక్షరీ స్తుతి.

 

 

Share this on WhatsAppలింగాభిషేకములో పరమార్ధం శివలింగం: నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే “లింగం”. పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం – భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య …

Review Overview

0

About admin

Comments are closed.

Scroll To Top
Read previous post:
KCR
KCR Promises 100% Irrigation in Telangana

KCR Promises 100% Irrigation in Telangana Chief Minister K. Chandrasekhar...

Narayana Murthy
Narayana Becomes Minister Without Winning Elections

Narayana Becomes Minister Without Winning Elections Chairman of Narayana Group...

Close